భార్యతో కలిసి సీఎం నిరాహార దీక్ష
మధ్యప్రదేశ్‌ని భోపాల్ దసరా మైదానంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ దీక్షకు కూర్చున్నారు. గిట్టుబాటు ధరలు, రుణమాఫీ, ఇతర డిమాండ్ల సాధన కోసం ఈ నెల 1 నుంచి మాందసార్ ప్రాంత రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. అయితే, రైతులను శాంతింప చేసేందుకు ముఖ్యమంత్రి చౌహాన్ ఈ శాంతి ఉపవాస దీక్షను ఎంచుకున్నారు. రైతులు వారి సమస్యలపై అక్కడే తనతో చర్చించవచ్చని ముఖ్యమంత్రి తెలిపారు. కాల్పులు జరిపిన పోలీసు సిబ్బందిపై తగిన చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. రైతుల ఆందోళనల్లో హింసకు పాల్పడే అసాంఘిక శక్తుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి దీక్షకు ఆ రాష్ట్ర మంత్రులు పలువురు మద్దతు పలికారు. రాష్ట్రంలో శాంతి నెలకొనేందుకు ఇదే సరైన మార్గమని మంత్రి మిశ్రా అన్నారు.













