భర్తకు 1వ ర్యాంక్, భార్యకు 2వ ర్యాంక్
ఛత్తీస్గడ్ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన పరీక్షలో దంపతులిద్దరూ అగ్రస్థానంలో నిలిచారు. చీఫ్ మున్సిపల్ ఆఫీసర్ (గ్రేడ్ బీ, గ్రేడ్ సీ)కు నిర్వహించిన పరీక్షలో భార్యభర్తలు ప్రథమ, ద్వితీయ ర్యాంకులను సాధించారు. 5 మే, 2019న పరీక్ష నిర్వహించగా మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఇంటర్వ్యూకి పిలిచారు. జులై 9, 10 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు తెలిపారు. భర్త అనుభవ్ సింగ్ 298.3744 మార్కులతో మొదటి ర్యాంకు సాధించగా భార్య విభా సింగ్ 283.9151 మార్కులతో రెండో ర్యాంకు సాధించింది. ఈ విజయం భార్యభర్తలిద్దరూ సంతోషం వ్యక్తం చేశారు. ఒకరికొకరు సాయం చేసుకుంటా ఈ విజయాన్ని అందుకున్నట్లు తెలిపారు.













