వాజ్ పేయిని పరామర్శించనున్న సీఎం చంద్రబాబు
తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్న మాజీ ప్రధాని వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరా తీశారు. ఈరోజు ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఎయిమ్స్‌లో వాజ్‌పేయిని చంద్రబాబు పరామర్శించనున్నారు. మరోవైపు వాజ్‌పేయి ఆరోగ్య పరిస్థితి తెలిసిన వెంటనే ఎయిమ్స్‌కు బీజీపీ అగ్రనేతలు, రాజకీయ ప్రముఖులు క్యూ కట్టారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, ఉపరాష్ట్రపతి వెంకయ్య, వాజ్‌పేయి దత్త పుత్రిక, పలువురు కేంద్రమంత్రులు ఎయిమ్స్‌లో వాజ్‌పేయిను పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.













