దేశం గొప్ప నాయకుడిని కోల్పోయింది : చంద్రబాబు
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ భౌతికకాయానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. ఢిల్లీలో వాజ్పేయీ నివాసానికి చేరుకొని ఆయన పార్థివదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ భారతదేశం గొప్ప నాయకుడిని కొల్పోయిందని అన్నారు. వాజ్పేయీ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన మృతి దేశానికి తీరని లోటన్నారు. అన్ని సంస్కరణలకు వాజ్పేయీ ఆద్యుడు అని అన్నారు. ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి వాజ్పేయీ అని, వాజ్పేయీ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని ఆయన అన్నారు. అలాగే ఏపీ అభివృద్ధికి వాజ్పేయీ సహకరించారని అన్నారు.













