అది వాజ్ పేయీ శకంగా చరిత్రలో నిలిచిపోతుంది
ప్రధానిగా అటల్ పరిపాలన, రాజకీయ అనుభవాలు వాజ్పేయీ శకంగా భారత చరిత్రలో నిలిచిపోతుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతించారు. ఆయన మృతితో దేశం గొప్ప రాజనీతిజ్ఞుడిని కోల్పోయిందని సంతాప సందేశంలో పేర్కొన్నారు. నమ్మిన ఆదర్శాలను నిజ జీవితంలో ఆచరించి చూపిన మానవతావాది. ఎంపీ, ప్రధాన ప్రతిపక్షనేత, విదేశాంగమంత్రి, ప్రధానమంత్రిగా బహుముఖ పాత్ర పోషించిన ఉదారవాది. పార్లమెంటులో తన అద్భుత ప్రసంగాలతో సమకాలీకులకు మార్గదర్శకం చేశారు. విశ్వాస పరీక్షలో ఒక ఓటుతేడాతో ప్రభుత్వం ఓడిపోయానా ఎంత మాత్రం చలించని మేరునగధీరుడు అని అన్నారు.













