ఏపీకి జైట్లీ సాయం మరువలేం …చంద్రబాబు
బీజేపీ సీనియర్‌నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ పార్థివ దేహానికి మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. ఢిల్లీలోని కైలాష్ నగర్లో జైట్లీ నివాసంలో ఆయన భౌతికకాయానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ వ్యక్తిగతంగా అరుణ్‌జైట్లీ తనకు చాలా సన్నిహితుడన్నారు. విద్యార్థి నాయకుడి నుంచి జైట్లీ అంచలంచలుగా ఎదిగారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ఒక స్నేహితుడిగా సాయం చేశారని చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఏపీ కోసం పోరాడారని కొనియాడారు. దేశం ఒక ఇంటెలెక్చువల్ను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన బిల్లు పార్లమెంటుకు వచ్చినప్పుడు.. హైదరాబాద్ తెలంగాణకు వెళ్తుంది కాబట్టి ఏపీ కోలుకోవాలంటే ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రతిపాదించారని, దాంతో అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ హోదాతో పాటు 6 హామీల ఇచ్చారని వివరించారు. ఆర్థిక శాఖ మంత్రిగా కూడా ఎంతో సాయం చేశారని గుర్తు చేశారు. జైట్లీ మరణం చాలా బాధాకరమని అన్నారు.













