ఆఫర్ ఇచ్చా… నిర్ణయం మీదే
తెలుగుదేశం పార్టీలోకి రమ్మని, ప్రభుత్వంలో చేరమని ఎన్జీవో సంఘం నేత అశోక్‌బాబుకు ఇప్పటికే ఆఫర్ ఇచ్చాను. సమర్థులు ప్రభుత్వంలో ఉంటే మరింత అభివృద్ధి జరుగుతుంది. నిర్ణయం తీసుకోవాల్సింది అశోక్‌బాబే అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఏపీ ఎన్జీవో హోంను ముఖ్యమంత్రి ప్రారంభించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడారు. నిజాయితీతో కూడిన ఉద్యోగుల డిమాండ్లన్నింటినీ పరిష్కరించే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో అవినీతిని అంతమొదించామని ధీమాతో తాను సవాల్ విసరడానికి ఉద్యోగుల పనితీరే కారణమన్నారు.













