ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వం
ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వం మరోసారి కుండబద్దలు కొట్టినట్లుగా తన వైఖరి వెల్లడించింది. హోదా ఇచ్చేది లేదు అని తేల్చి చెప్పింది. లోక్సభలో జేడీయూ ఎంపీ కౌశలేంద్ర కుమార్ అడిగిన ఓ ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ, ఒడిసా, రాజస్థాన్, బిహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్ల నుంచి ప్రత్యేక హోదా డిమాండ్లు వచ్చాయి. అయితే, ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వం పరిశీలనలో లేవు అని నిర్మలా సీతారామన్ చెప్పారు.













