జనవరి 1 నుంచే ఆర్థిక సంవత్సరం ?
ఆర్థిక సంవత్సరాన్ని మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ఏప్రిల్ 1వ తేదీ నుంచి మార్చి 31 వరకు ఆర్థిక సంవత్సరం అమలవుతోంది. అయితే జనవరి 1వ తేదీనుంచి డిసెంబర్ 31 వరకు ఉన్న 12 నెలల కాలాన్ని ఆర్థిక సంవత్సరంగా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయ ఉత్పత్తుల కాలానికి అనుగుణంగా అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడుతుందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. గత ఏడాది జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో రాష్ట్రాల ముఖ్యమంత్రులనుద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ ఆర్థిక సంవత్సరాన్ని జనవరి -డిసెంబర్‌కు మార్చాలన్న ప్రతిపాదనను సమర్థించారు.













