కేంద్ర ప్రభుత్వం భారీ ప్యాకేజీ
కరోనా మహమ్మారి వ్యాప్తికి అడ్డుక•్టవేసేందుకు అమలు చేస్తున్న దేశవ్యాప్త లాక్డైన్తో పేదలు ఇబ్బంది పడకుండా రూ.1.7 లక్షల కోట్ల భారీ ప్యాకేజీని కేంద్రం ప్రకటించింది. దేశవ్యాప్త లాక్డౌన్ను ప్రధాని మోదీ ప్రకటించిన 36 గంటల్లొనే ఈ మేరకు చర్యలు ప్రారంభించింది. దేశ వ్యాప్తంగా ఉన్న నిరుపేద కుటుంబాలకు వచ్చే మూడు నెలలపాటు ఉచితంగా ఆహార ధాన్యాలు, వంటగ్యాస్ పంపిణీ చేయడంతోపాటు మహిళలు, సీనియర్ సిటిజన్లకు ఆర్థికంగా చేయూత అందివ్వడం వంటి చర్యలను అమలు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
లాక్డౌన్తో పేదలు, కూలిపని వారు ఇబ్బంది పడకుండా ప్రకటించిన ఈ చర్యలు వెంటనే అమల్లోకి వస్తాయని మీడియా సమావేశంలో మంత్రి వివరించారు. లాక్డౌన్ కారణంగా ఆకలితో ఎవరూ బాధపడరాదనేదే తమ లక్ష్యమని ఆమె సృష్టం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన సాయం లక్షిత వర్గాలకు అందేలా శ్రద్ధ వహిస్తామన్నారు. అవసరమైతే ఇలాంటి మరిన్ని చర్యలను మున్ముందు ప్రకటిస్తామని కూడా ఆమె చెప్పారు.













