కేంద్ర మంత్రివర్గ విస్తరణ కు ముహుర్తం ఖరారు
కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణకు ముహుర్తం ఖరారు అయింది. వచ్చే నెల (ఆగస్టు)లో మంత్రివర్గ విస్తరణ జరగనున్నట్లు సమాచారం. కొత్తగా పలువురికి కేబినెట్ బెర్త్‌లు దక్కనున్నాయి. అలాగే మంత్రుల శాఖల్లోనూ మార్పులు, చేర్పులు జరగే అవకాశం ఉంది. మహాఘట్బంధన్ నుంచి విడిపోయి బీజేపీతో జతకట్టిన జేడీయూ కేబినెట్లో చేరనుంది. జేడీయూ నుంచి ఇద్దరికి మంత్రి పదవులు దక్కే ఛాన్స్ ఉంది. ఓ వైపు కేంద్ర సమచారా, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా మనోహర్ పారికర్ గోవా ముఖ్యమంత్రిగా వెళ్లడం, అనిల్‌దవే ఆకస్మిక మరణంతో కేబినెట్లో ఖాళీలు ఏర్పడ్డాయి.













