లాక్డౌన్ నుంచి వీటికి మినహాయింపు
లాక్డౌన్ విధించి దాదాపు నెల రోజులు పూర్తి కావస్తున్న నేపథ్యంలో కేంద్రం మరికొన్నింటికీ మినహాయింపు ఇచ్చింది. నాన్ హాట్స్పాట్ ప్రాంతాల్లో ఇప్పటికే కొన్నింటికి మినహాయింపు ఇవ్వగా.. ఆ జాబితాలోకి మరికొన్నింటిని చేర్చింది. అర్బన్ ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ దుకాణాలు, స్టేషనరీ షాపులకు మినహాయింపు ఇస్తున్నట్లు కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి సలిల శ్రీవాస్తవ తెలిపారు. మిల్క్ ప్రాసెసింగ్ యూనిట్లు, మొబైల్ రీఛార్జి దుకాణాలు, పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పనిచేస్తాయని తెలిపారు. రహదారి నిర్మాణ పనులు, సిమెంట్ యూనిట్లకు లాక్డౌన్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. హాట్స్పాట్ కేంద్రాలకు ఇవి వర్తించబోవన్నారు.













