కేంద్ర ఎన్నికల కమిషనర్ గా సునీల్ చంద్ర
కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సిబిడిటి) చైర్మన్‌గా ఉన్న సునీల్ చంద్రను కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు. అంతకుమందు ఎన్నికల కమిషనర్‌గా ఉన్న సునీల్ అరోరా గత డిసెంబర్లో చీఫ్ ఎన్నికల కమిషనర్(సీఇఒ)గా ఒపి రావత్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి ఈ స్థానం ఖాళీగా ఉంది. 1980 బ్యాచ్‌కు చెందిన ఐఆర్ఎస్ అధికారి అయిన సునీల్ చంద్ర ఐఐటి నుంచి పట్టా పొందారు. ఆదాయ పన్ను శాఖలో వివిధ బాధ్యతలు నిర్వహించారు. సిబిడిటి చైర్మన్‌గా 2016, నవంబర్ 1న బాధ్యతలు చేపట్టిన ఆయన పదవీకాలం ఈ ఏడాది మే 31తో ముగియనుంది.













