మహిళా పారిశ్రామికవేత్తలకు ఐఏసీసీ శిక్షణ
ఇండో-అమెరికన్ చాంబర్ ఆఫ్ కామర్స్ (ఐఏసీసీ) తెలుగు రాష్ట్రాల చాప్టర్ మహిళా పారిశ్రామికవేత్తల కోసం శ్రీ పేరుతో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అమెరికా కాన్సులేట్ జనరల్ కేథరిన్ హడ్డా, ఐఏసీసీ ఏపీ, టీఎస్ చాప్టర్ల చైర్మన్ శ్రీకాంత్ బాడిగ, వైస్ చైర్మన్ విజయ సాయి మేక కలిసి ఈ కార్యక్రమ బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఏప్రిల్ 11, 12 తేదీల్లో జరగనున్న ఈ కార్యక్రమంలో వ్యాపార వృద్ది, విస్తరణపై మహిళా పారిశ్రామికవేత్తలకు శిక్షణ ఇవ్వనున్నారు.













