దక్షిణాదిపై దృష్టి
భారతీయ జనతా పార్టీ, ఇప్పుడు దక్షిణాదిపై దృష్టి సారించిందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు చెప్పారు. గురువారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దక్షిణాదిలో బిజెపి బలపడడానికి తెలుగుదేశం పార్టీ అడ్డంకి కాదని అన్నారు. మిత్రపక్షాలు బలపడితేనే, ఎన్డీయే కూటమి బలంగా ఉంటుందని ఆయన అన్నారు. దక్షిణది రాష్ట్రాల్లో ఉన్న 130 లోక్‌సభ నియోజకవర్గాలను కైవసం చేసుకునేందుకు పార్టీ అథిష్టానం వ్యూహ రచన చేస్తోందని అన్నారు.
ఐదు లోక్‌సభ నియోజకవర్గాలను ఒక క్లస్టర్‌గా ఏర్పాటు చేసి, దానికి కేంద్ర మంత్రులు, కేంద్ర, రాష్ట్ర స్థాయి పార్టీ నాయకులను ఇన్‌చార్జ్‌లుగా నియమిస్తున్నట్టు ఆయన చెప్పారు. మోదీ ప్రభుత్వం అందిస్తున్న వివిధ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి వీరంతా కృషి చేయాల్సి ఉందని చెప్పారు.













