ప్రధాని సంచలన నిర్ణయం
పార్లమెంట్ లో గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలకు నిరసనగా బీజేపీ ప్రభుత్వం నిరసనలకు సిద్ధమైపోయింది. ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ నెల 12న బీజేపీ ఎంపీలంతా నిరాహార దీక్ష చేపట్టాలని మోదీ పిలుపునిచ్చారు. పార్లమెంట్ నిరవధిక వాయిదా తర్వాత జరిగిన బీజేపీ పార్లమెంటరీ సమావేశంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
బీజేపీ కలుపుగోలు రాజకీయాల కోసం ప్రయత్నిస్తుంటే, కాంగ్రెస్ మాత్రం మోసపూరిత రాజకీయాలకు తెరలేపింది. కుట్రపూరితంగా వ్యవహరిస్తూ సభాకార్యకలాపాలను అడ్డుకుంది. పైగా ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను పంపిస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ ఎంపీలు, నేతలంతా నిరసన ప్రదర్శనలకు సిద్దంకండి అని ప్రధాని పిలుపునిచ్చినట్లు కేంద్ర మంత్రి అనంత్ కుమార్ మీడియాకు వెల్లడించారు.













