తెలుగు రాష్ట్రాలకు నూతన అధ్యక్షులు : విద్యాసాగర్
తెలంగాణ, ఆంధప్రదేశ్ రాష్ట్రాలకు నూతన అధ్యక్షులు రాబోతున్నారని మాజీ గవర్నర్, బీజేపీ సీనియర్ నేత విద్యాసాగర్ రావు తెలిపారు. తెలంగాణలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతామన్నారు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డాను మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు కలిశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో నయా నిజాం పాలన కొనసాగుతోందని పేర్కొన్నారు. విపక్షాలు రాజకీయ అవసరాల కోసమే సీఏఏ, ఎన్ఆర్సీని వ్యతిరేకిస్తున్నాయన్నారు. తెలంగాణలో సెప్టెంబర్ 17ని అధికారికంగా నిర్వహించాలని సృష్టం చేశారు. మాతృభాష ప్రాధాన్యతను చాటి చెప్పేలా హైదరాబాద్లో కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. భాష విషయంలో విద్యార్థుల్లో సంఘర్షణ లేకుండా చూడాలన్నారు.













