ముగ్గురు ప్రముఖులకు భారతరత్న ప్రదానం
మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, దివంగత భారతీయ జనసంఘ్ నాయకుడు నానాజీ దేశ్‌ముఖ్, దివంగత గాయకుడు భూపేన్ హజారికాలను దేశంలోని అత్యున్నత పౌరపురస్కారం భారతరత్నను ప్రదానం చేశారు. ప్రణబ్ ముఖర్జీకి, హజారికా కుమారుడు తేజ్‌కు, నానాజీ సమీప బంధువు విక్రమ్‌జీత్ సింగ్‌కు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ రాష్ట్రపతిభవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఈ పురస్కారాలు అందించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్రమంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్ తదితరులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. భారతరత్న అందుకున్న అయిదో రాష్ట్రపతిగా ప్రణబ్ దా నిలిచారు.













