మహిళా కానిస్టేబుల్ చేసిన పని నన్నెంతో కదిలించింది
కన్నబిడ్డ తనకు అక్కర్లేదని ఓ తల్లి వదిలేస్తే, మరో తల్లి ఆ బిడ్డను అక్కున చేర్చుకుంది. పాలిచ్చి ఆ చిన్నారికి అమ్మయ్యింది. ఆమే బెంగళూరుకు చెందిన మహిళా కానిస్టేబుల్ అర్చన. అమ్మగా అర్చన చేసిన పనిని సామాజిక మాధ్యమాల వేదికగా ఎందరో అభినందిస్తున్నారు. తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా స్పందించారు. ట్విటర్ ద్వారా అర్చనను ప్రశంసించారు. మీడియా ద్వారా చిన్నారి వార్త తెలిసింది. మహిళా కానిస్టేబుల్ చేసిన పని నన్నెంతో కదిలించింది. ఆమె గొప్ప తల్లి. త్వరలోనే అమెను నేను కలుస్తా అని కర్ణాటక ముఖ్యమంత్రి ట్వీట్ చేశారు.













