ఢిల్లీలో అమెరికా మాజీ అధ్యక్షుడు
అమెరికా మాజీ అధ్యక్షుడు ఒరాక్ ఒబామా గత రాత్రి న్యూఢిల్లీ చేరుకున్నారు. ఆయన హిందుస్తాన్ టైమ్స్ నిర్వహిస్తున్న లీడర్షిప్ సదస్సులో మాట్లాడారు. టౌన్హాల్లో జరిగే కార్యక్రమంలో ఒరాక్ ఒబామా మాట్లాడుతారని ఒబామా ఫౌండేషన్ వెల్లడించింది. సుమారు 300 మందిని ఉద్దేశించి ఒబామా ప్రసంగించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఆయన కలిసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ ఏడాది జనవరిలో అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత ఒబామా తొలిసారి భారత పర్యటన చేపట్టారు. ఇదే కార్యక్రమంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ కూడా మాట్లాడుతారు.













