తెలుగు రాష్ట్రాల్లో సమ్మె విజయవంతం
వేతన సరవణతో పాటు ఇతర ప్రధాన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత బ్యాంకు ఉద్యోగులు సమ్మె మొదలుపెట్టారు. సమ్మెలో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సమ్మె తొలిరోజు విజయవంతమైంది. ఉద్యోగుల డిమాండ్ల సాధనకై యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (యూఎఫ్బియూ) రెండు రోజుల పాటు 48 గంటల సమ్మెకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దేశ్యాప్తంగా పిలుపు మేరకు ఎస్బిఐతో పాటు 21 ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి దాదాపు 60 వేల మంది సిబ్బంది సమ్మెకు జై కొట్టారు. ఆన్లైన్ లావాదేవీలు తప్ప ఇతర లావాదెవీలు అన్నీ పూర్తిగా స్తంభించి పోయాయి. ఎటీఎంలలో నగదు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. చాలా బ్యాంకులు తెరుచుకోలేదు.













