రాజకీయాలకు మాత్రమే కాదు చిత్రసీమకు కూడా
డీఎంకే అధినేత కరుణానిధి మరణం రాజకీయాలకు మాత్రమే కాదు చిత్రసీమకు కూడా తీరని లోటని నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. అత్యుత్తమ రాజకీయ నేతను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు. నాన్నగారితో ఆయనకు విశేషమైన అనుబంధం ఉండేదని గుర్తు చేశారు. 80 ఏళ్ల రాజకీయ అనుభవం, 5 సార్లు ముఖ్యమంత్రిగా, 13 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం అనేది మాములు విషయం కాదు. అటువంటి రాజకీయ చరిత్ర కలిగిన మహానుభావుడు నేడు మన మధ్య లేకపోవడం బాధాకరం. ఆయన లోటు తీర్చలేనిదని, ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని బాలకృష్ణ అన్నారు.













