అద్వానీ, సింఘాల్ పాత్ర కీలకం
అయోధ్య వివాదంలో సుప్రీంకోర్టు తీర్పును పలువురు స్వాగతించారు. ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకర్త, రామ జన్మభూమి రథయాత్రలో కీలక పాత్రధారి కేఎన్ గోవిందాచార్య మాట్లాడుతూ, ఈ కేసులో తీర్పు తమకు అనుకూలంగా రావడానికి విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ) నేత అశోక్ సింఘాల్, ఎల్కే అద్వానీ చేసిన కషే కారణమని తెలిపారు. ‘సుప్రీంకోర్టు తుది తీర్పు చాలా సంతోషం కలిగించింది. ఇక మూడు నెలల్లో రామమందిరం నిర్మాణానికి ప్రణాళిక రూపొందించాల’ని కోరారు. ప్రజలంతా సంయమనంతో మెలగాలని, మత సామరస్యం పాటించాలని కోరారు. ఈ విజయానికి ప్రధాన కారణం ఎవరు అనుకుంటున్నారని ప్రశ్నించగా.. ‘ఆలయ నిర్మాణం కోసం లక్షలాది మంది త్యాగాలు చేశారు. చాలా మంది అనేక రకాలుగా రామ జన్మభూమి ఉద్యమంలో తమ పాత్ర పోషించారు. అశోక్ సింఘాల్, ఎల్కే అద్వానీ మాత్రం ఈ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారని ఆయన చెప్పారు.
వెలువరించిన సుప్రీం తీర్పు…రాముని పుట్టిన ప్రదేశం అదే
అత్యంత సున్నితమైన అయోధ్యలోని రామ జన్మభూమి- బాబ్రీ మసీదు భూ యాజమాన్య వివాదంపై సర్వోన్నత న్యాయస్థానం శనివారం కీలక తీర్పు వెలువరించింది. వివాదాస్పద కట్టడం ఉన్న స్థలం హిందువులదేనని స్పష్టం చేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతత్వంలోని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తుది తీర్పు చెప్పింది. 2.77 ఎకరాల స్థలం హిందువులకే చెందుతుందని తేల్చిచెప్పేసింది. వివాదాస్పద స్థలానికి సంబంధించి 3 నెలల్లో కేంద్రం ట్రస్ట్ ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
వివాదాస్పద స్థలాన్ని ట్రస్ట్ ఆధీనంలో ఉంచాలని, కేంద్రం ఏర్పాటు చేసే ట్రస్ట్‌లో నిర్మోహి అఖాడాకు ప్రాతినిథ్యం కల్పించాలని సూచించింది. ఆలయ నిర్మాణం, ట్రస్ట్ విధి విధానాలపై 3 నెలల్లోగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. మసీదు నిర్మాణానికి ముస్లింలకు అయోధ్యలో ప్రత్యామ్నాయ స్థలం ఇవ్వాలని సుప్రీంకోర్టు సూచించింది. మసీదు నిర్మాణానికి సున్నీ వక్ాబోేర్డుకు 5 ఎకరాల స్థలం కేంద్రం లేదా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వాలని ఆదేశించింది. రాజకీయాలు, చరిత్రలకు అతీతంగా న్యాయం నిలబడాలని సుప్రీంకోర్టు పేర్కొంది.













