వాజ్ పేయీ మృతిపట్ల ప్రపంచనేతల దిగ్భ్రాంతి
మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి మృతిపట్ల ప్రపంచనేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అమెరికా, రష్యా, బ్రిటన్, పాకిస్థాన్, జపాన్ సహా సార్క్ దేశాధినేతలు సంతాపం ప్రకటించారు. భారత్, అమెరికా సంబంధాలు మెరుగుపరచడంలో వాజ్‌పేయీ కీలక పాత్ర పోషించారని ఈ సందర్భంగా అమెరికా దౌత్య కార్యాలయం గుర్తు చేసుకుంది. ఇరుదేశాల మధ్య సహజసిద్ధ సంబంధాలు ఉన్నాయని వాజ్‌పేయీ అనేవారని అమెరికా దౌత్య కార్యాలయం ప్రకటించింది. భారత రాజకీయాల్లో వాజ్‌పేయి పేరు ఓ అంతర్భాగమైందని, ప్రపంచం ఒక గొప్ప రాజనీతిజ్ఞుడ్ని కోల్పోయిందని రష్యా వ్యాఖ్యానించింది. బంగ్లాదేశ్‌కు అటల్ మంచి మిత్రుడని ఆ దేశ ప్రధాని షేక్ హసీనా అన్నారు. శాంతి కోసం వాజ్‌పేయీ చేసిన ప్రయత్నాలు తప్పకుండా సత్ఫలితాలు ఇస్తాయని పాకిస్థాన్ కాబోయే ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ విశ్వాసనం వ్యక్తం చేశారు.













