కాంగ్రెస్ కు ప్రతిష్టాత్మకమైన ఎన్నికలు ఇవి!
త్వరలో జరగనున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. ఓవైపు రాహుల్‌ను ప్రధానిని చేసేందుకు ఒప్పుకోని ప్రతిపక్షాలు, కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేసేందుకు పెద్దగా ఇష్టపడటం లేదు. కాంగ్రెస్‌తో కలిసి పోటీచేయాలన్న తలంపుకు బిఎస్పీ అధినేత్రి మాయావతి గండికొట్టారు. కాంగ్రెస్‌తో తమకు పొత్తు లేదని ఏకపక్షంగా ప్రకటించడమే కాదు, ఆమె తన దారి తాను చూసుకొంటున్నారు. కాంగ్రెస్ బలంగా ఉన్న రాష్ట్రాలలోనే ఆ పార్టీతో కలసి పోటీ చేయడానికి ఇతర పక్షాలు సిద్ధపడడం లేదు. దీంతో కాంగ్రెస్ ఒంటరిగానే పోరాడాలని నిర్ణయించుకుంది. అసెంబ్లీ ఎన్నికలపై ద ష్టి సారించడం ద్వారా ముందుగా తన బలాన్ని స్థిరీకరించుకొనే ప్రయత్నం చేస్తున్నది. ఒక విధంగా చెప్పాలంటే ఐదు రాష్ట్రాల ఎన్నికలు కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మకమైనది. కాంగ్రెస్ అధ్యక్ష పదవిని రాహుల్ చేపట్టిన తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో గెలుపుకు ఆ పార్టీ ఎంతో కష్టపడాల్సి వస్తోంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ రెండు చోట్ల అయినా గెలిస్తే దేశంలో ప్రధాన విపక్షంగా నిలుస్తుంది. లేకపోతే అది కూడా ప్రాంతీయ పార్టీలాగా తయారవుతుందని అంటున్నారు. ఈ రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు 2019 లోక్‌సభ ఎన్నికలపై ప్రభావం చూపునున్నది.
తెలంగాణ, రాజస్తాన్‌లలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పాటు జరిగితే రాహుల్ గాంధీ ప్రాధాన్యత విపక్షాలలో ఒకేసారి పెరుగుతుంది. లోక్‌సభ సీట్ల సర్దుబాటులో పైచేయి కాగలదు. మరిన్ని కొత్త పక్షాలు కాంగ్రెస్‌తో పొత్తులకు సుముఖత చూపే అవకాశం ఉంటుంది. అందుకనే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల పట్ల కాంగ్రెస్ ప్రధానంగా దృష్టి పెడుతోంది.
మరోవైపు తెలంగాణలో కొంచెం పట్టు పెంచుకున్న కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో తెలంగాణపై రాహుల్ ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారు. అందుకు తగ్గట్టుగా టిక్కెట్ల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. మరోవైపు విపక్షాలను తన కూటమిలోకి వచ్చేలా కూడా చేసుకోగలిగారు. తెలంగాణలో గెలిస్తే దేశంలో దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ ప్రధాని నరేంద్రమోదీకి మిత్రుడిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ?నేపథ్యంలో కేసీఆర్‌ను ఓడిస్తే మోదీకి అది పరోక్షంగా దెబ్బకాగలదని కాంగ్రెస్ భావిస్తోంది.
బిజెపి కూడా తాను గెలవకపోయినా కాంగ్రెస్‌కు మాత్రం అధికార?లభించకుండా చూడాలని భావిస్తోంది. ముఖ్యంగా తెలంగాణ, మిజోరంలలో తమ పార్టీకి మెజారిటీ రాకున్నా, కాంగ్రెస్‌ను అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికే ప్రధానంగా దష్టిని కేంద్రీకరించింది. కాంగ్రెస్ బలహీనమైతే భాజపాను ఎదిరించే అవకాశాలు ఇతర పార్టీలకు ఉండకపోవచ్చని అనుకుంటోంది. మహారాష్టల్రో శివసేన ప్రస్తుతం బిజెపిపై ఎన్ని విమర్శలు ఘాటుగా చేస్తున్నా కాంగ్రెస్, ఎన్సీపీలతో అది చేతులు కలపదు. రాజకీయ అస్తిత్వం కోసం బిజెపి అండ ఆ పార్టీకి కావాల్సిందే. మరోవైపు దేశంలో దాదాపు ప్రాంతీయ పార్టీలన్నీ హంగ్ పార్లమెంట్ ఏర్పడాలని కోరుకొంటున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో కాంగ్రెస్‌కు ఐదు రాష్ట్రాల ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారాయి.













