‘ఐటీ’ సహకారంతోనే భారత్ బంద్ విజయవంతం
దళిత వర్గాలు ఈ నెల 2న నిర్వహించిన భారత్‌బంద్ విజయవంతం కావడానికి ఐటీ విజ్ఞానం దోహదపడినట్లు అమెరికాకు చెందిన దళిత కార్యకర్తల కీలక బృందం ఒకటి వెల్లడించింది. ఈ మేరకు కృత్రిమ మేధ, జీఐఎస్, బిగ్‌డేటా, సామాజిక మాధ్యమాలను వినియోగించినట్లు తెలిపింది. ఎస్సీ, ఎస్టీ(వేధింపుల నిరోధక) చట్టం విషయమై దళితులు ఈ ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమం ద్వారా తాము ఏ రాజకీయ పార్టీకి అనుబంధంగా పనిచేయాల్సిన అవసరం లేదని దళితులు నిరూపించారని న్యూజెర్సీకి చెందిన బృందం ప్రతినిధి దిలీప్మహస్కే పేర్కొన్నారు. అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, మధ్యప్రాచ్య దేశాలకు చెందిన దళిత కార్యకర్తలకు సంబంధించి దిలీప్ సీక్రెటివ్ నెట్వర్క్ ను నిర్వహిస్తున్నారు.













