రాహుల్ గాంధీతో సీఎం చంద్రబాబు భేటీ
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీతో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. గత కొంతకాలంగా దేశంలో జరుగుతున్న అనేక రాజకీయ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు కాంగ్రెస్‌తో స్నేహంగా వ్యూహ్మాతంగా వ్యవహరిస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తొలి సంతకం ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపైనే ఉంటుందని రాహుల్ ప్రకటించిన నేపథ్యంలో ఇరు పార్టీల మధ్య సఖ్యతకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. బీజేపీయేతర పార్టీలను ఏకతాటిపైకి తేవడమే లక్ష్యంగా చంద్రబాబు రాహుల్‌తో భేటీ అయ్యారు. దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ కూటమి ఏర్పాటుపై ఆయనతో చర్చించనున్నారు. ఇదే అంశంపై ఇప్పటికే శరద్ పవార్, ఫరూక్ అబ్దుల్లాలతో ముఖ్యమంత్రి భేటీ అయిన విషయం తెలిసిందే. రాహుల్‌తో భేటీలో ముఖ్యమంత్రి వెంట ఎంపీలు సీఎం రమేష్, గల్లా జయదేవ్, కనకమేడల రవీంద్రకుమార్, మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్రావు ఉన్నారు.













