ఏప్రిల్ 11న తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు
లోక్‌సభ స్థానాలతో పాటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 175 శాసనసభ స్థానాలకూ ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. దీని ప్రకారం లోక్‌సభ, శాసనసభ స్థానాలకు ఏప్రిల్ 11వ తేదీ పోలింగ్ జరగనుంది. మే 23న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్‌సభ నియోజకవర్గాలతో పాటు తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకూ ఏప్రిల్ 11నే ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ స్థానాల్లో 29 ఎస్సీలకు, 7 ఎస్టీలకు, 139 జనరల్‌కు రిజర్వేషన్ చేశారు. అదే విధంగా 25 లోక్‌సభ స్థానాల్లో 4 ఎస్సీలకు, 1 ఎస్టీకి, జనరల్‌కు 20 కేటాయించారు. తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాల్లో 3 ఎస్సీలకు, 2 ఎస్టీలకు, 12 జనరల్‌కు కేటాయించారు. నోటిఫికేషన్ విడుదల 18 మార్చి. నామినేషన్లకు చివరిరోజు 25 మార్చి. నామినేషన్ల పరిశీలన 26 మార్చి. ఉపసంహరణకు తుది గడువు 28 మార్చి. పోలింగ్ తేది 11 ఏప్రిల్. ఓట్ల లెక్కింపు మే 23 అని ఎన్నికల కమిషన్ ప్రకటించింది.













