అన్నా హజారే నిరాహార దీక్ష ప్రారంభం
లోక్‌పాల్ నియామకం కోసం అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు, ప్రముఖ గాంధేయవాది అన్నా హజారే నిరాహార దీక్షను ప్రారంభించారు. మహారాష్ట్రంలోని అహ్మద్‌నగర్‌లోని హజారే స్వగ్రామం రాలేగణ్ సిద్ధీలో ఈ దీక్ష మొదలైంది. లోక్‌పాల్ చట్టం అమల్లోకి వచ్చి ఐదేళ్లు గడిచినా మోదీ ప్రభుత్వం లోక్‌పాల్‌ను నియమించకపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ హజారే ఈ దీక్షను చేపట్టారు. రైతుల సంక్షేమం కోసం స్వామినాథన్ కమిషన్ చేసిన సిఫార్సులను, కొన్ని ఎన్నికల సంస్కరణలను అమలు చేయాలని, లోకాయుక్తా చట్టాన్ని మహారాష్ట్ర ఆమోదించాలని కూడా హజారే డిమాండ్ చేస్తున్నారు.













