4వ విడత ఎన్నికల్లో ఓటేసిన ప్రముఖులు
లోక్‌సభ ఎన్నికల నాలుగో విడత పోలింగ్‌లో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్, ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీతో పాటు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్, రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజే సహా పలువురు ప్రముఖులు సోమవారం ఓటు హక్కు వినియోగించుకున్నారు. దేశంలోని 9 రాష్ట్రాల్లో మొత్తం 72 నియోజకవర్గాల్లో నాలుగో దశ పోలింగ్ ఇప్పటికే ప్రారంభమైన విషయం తెలిసిందే. ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ ముంబయిలోని జీడీ సొమానీ పాఠశాలలో ఏర్పాటు చేసిన 216 నెంబరు పోలింగ్ బూత్‌లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ చింద్వాడా నియోజకవర్గ పరిధిలోని శిఖర్‌పూర్‌లో ఓటేశారు. ఆర్బీఐ గవర్నర్ శక్తికాంతదాస్ ముంబయి పెద్దార్ రోడ్‌లోని 40వ నెంబర్ పోలింగ్ బూత్‌లో ఓటేశారు.













