ముకేశ్ అంబానీ ఇంట మూడో పెళ్లి?
పారిశ్రామిక దిగ్గజం ముకేశ్ అంబానీ ఇంట మూడో పెళ్లికి రంగం సిద్ధమవుతోందా? మంగళవారం ఉదయం నుంచి సామాజిక మాధ్యమాల్లో ఆయన చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ కలిసి దిగిన ఫొటోలు చక్కర్లు కొడుతుండటంతో వారి నిశ్చితార్థం జరిగిపోయిందని, డిసెంబరులో పెళ్లి అంటూ వార్తలొస్తున్నాయి. అయితే దీన్ని రిలయన్స్ ప్రతినిధి ఒకరు ఖండించారు. నిశ్చితార్థం జరగలేదు, అవన్నీ వదంతులే అని కొట్టిపారేశారు. ఇదిలా ఉంటే ఇటీవలే ఆకాశ్ అంబానీ-శ్లోకా మెహతా, ఈశా అంబానీ -ఆనంద్ పిరమాల్ల నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. వీరి పెళ్లిళ్లు డిసెంబరులో జరుగుతాయని ఇప్పటికే ప్రకటించారు.













