ఏపీ విభజన సమయంలో ఏం చేశారో చూసుకోండి
జమ్మూ-కశ్మీర్ విభజన బిల్లుపై కాంగ్రెస్ ఆరోపణలను కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తిప్పికొట్టారు. తమకు పాఠాలు చెప్పే నాయకులు.. ఏపీ విభజన సమయంలో ఏం చేశారో చూసుకోవాలని హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలను కాంగ్రెస్ ఎలా విభజించిందో ఒక్కసారి గుర్తు చేసుకోండి. కాంగ్రెస్ నాయకులు మార్షల్స్‌తో అందరినీ బయటకు గెంటేశారు. తలుపులు, టీవీలు మూసేసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విభజన పూర్తి చేశారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. అందువల్ల ఎలా చేయాలో మాకు పాఠాలు చెప్పొద్దు అని హోంమంత్రి అన్నారు. తాము ఏడాదిపాటు నిరంతరం సంప్రదింపులు జరిపామని, ఆనాడు తానే అన్ని వర్గాల అభిప్రాయాలు తీసుకున్నానని ప్రధాన ప్రతిపక్ష నేత గులాంనబీ ఆజాద్ చెప్పారు.













