అదీ అసలైన చీకటి రోజు
రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా జమ్మూ-కశ్మీర్ బిల్లు తేవడాన్ని చీకటి రోజుగా కాంగ్రెస్ అభివర్ణించడాన్ని హోంమంత్రి అమిత్షా తిప్పికొట్టారు. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో పార్లమెంటులో తలుపులు మూసేసిన రోజు అసలైన చీకటి దినమని అభివర్ణించారు. అప్పట్లో అందరితో సంప్రదింపులు జరిపి బిల్లు తెచ్చామని కాంగ్రెస్ సభ్యుడు మనీశ్ తివారీ చేసిన వ్యాఖ్యలను లోక్సభలో అమిత్షా ఖండించారు. విభజన సమయంలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరుపై తెలుగు రాష్ట్రాల ప్రజలతోపాటు, దేశానికి కొన్ని వివరాలు చెప్పదలచుకున్నానంటూ నాటి పరిణామాలను ఎండగట్టారు.













