అమర్నాథ్ యాత్రపై కరోనా తర్వాతే నిర్ణయం
కరోనాతో నెలకొన్న ఆందోళనకర పరిస్థితులు సద్దుమణికిగిన తర్వాతే అమర్నాథ్ యాత్రపై తుది నిర్ణయం తీసుకుంటామని శ్రీ అమర్నాథ్జీ ఆలయ బోర్డు (ఎస్ఏఎస్బీ) ప్రకటించింది. జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ బీసీ ముర్ము నేతృత్వంలో బోర్డు సమావేశమైంది. అనంతరం అధికార ప్రతినిధి మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో యాత్రను రద్దు చేస్తున్నట్టు చెప్పారు. మొదటి పూజ, సంపన్న పూ• మాత్రం ఆచారం ప్రకారం నిర్వహిస్తామని చెప్పారు. అయితే అరగంటలోనే మొదట ఇచ్చిన ప్రకటనను రద్దు చేస్తున్నట్టు చెప్పారు. కరోనా పరిస్థితులు సద్దుమణిగాక మరోసారి సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 3,880 కి.మీల మేర సాగే అమర్నాథ్ యాత్ర జూన్ 23న ప్రారంభం కావాల్సి ఉన్నది.













