అంబానీ ఇంట పెళ్లి సందడి
దేశంలోనే కుబేరుడైన వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ కుమారుడి నిశ్చితార్థానికి ముహూర్తం ఖరారైంది. ముఖేష్ అంబానీ కుమారుడు ఆకాశ్ అంబానీ, శ్లోక మెహతాల నిశ్చితార్థ వేడుక ఈ నెల 30న జరగనుంది. ఇందుకు సంబంధించిన ఆహ్వాన వీడియోను రూపొందించారు. ముఖేష్ అంబానీ స్వగృహం యాంటిల్లాలో వేడుక జరగనుంది. వీరి వివాహం ఈ ఏడాది చివర్లో జరగనుందన్న వార్తలు కూడా వచ్చాయి. డిసెంబర్ 8-10 మధ్య పెళ్లి ఉండొచ్చన్న సమాచారం బయటకు వచ్చింది. అయితే, కచ్చితంగా పెళ్లి ఎప్పుడన్న దానిపై ఇరు కుటుంబాల నుంచి ఎటువంటి అధారిక ప్రకటన రాలేదు. నిశ్చితార్థంతో సృష్టత వచ్చే వచ్చే అవకాశం ఉంది. 25 ఏళ్ల ఆకాశ్ అంబానీ ముఖేష్ అంబానీ పెద్ద కుమారుడు. రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డు డైరెక్టర్గా ఉన్నారు. రిలయన్స్ జియో రూపకర్త. ఇక శ్లోక మోహతా వజ్రాల వ్యాపారి రస్సెల్ మెహతా కుమార్తె.













