అకాశ్, శ్లోకా పెళ్లి వేడుకలు షురూ
పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ కుమారుడు అకాశ్ అంబానీ, శ్లోకా మెహతాల వివాహానికి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. వీరి వివాహం మార్చి 9న జరగనుంది. అంబానీ నివాసం ఆంటీలియాలో పెళ్లి వేడుకలకు అంతా సిద్ధం చేస్తున్నారు. అయితే సోమవారం రాత్రి ఆంటీలియాలో మ్యూజికల్ నైట్‌తో పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి. గార్బా సింగర్ ఫల్గుణి పాథక్ ఈ మ్యూజికల్ నైట్‌లో ప్రదర్శన ఇచ్చారు. మ్యూజికల్ నైట్‌లో ఇరు కుటుంబాలు డాన్స్‌లతో హంగామా చేశాయి. ఆకాశ్ నానమ్మ కోకిలాబెన్, అనిల్ అంబానీ సతీమణి టీనా అంబానీ ఈ వేడుకకు హాజరయ్యారు. బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని జియో వరల్ సెంటర్లో అకాశ్ జంట పెళ్లి ఉంటుందని తెలుస్తోంది.













