డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించిన ఎయిర్ ఏషియా
పండగల సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని ఎయిర్ ఏషియా విమాన టికెట్లపై 70 శాతం వరకు డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 15 నుంచి 28 వరకు టికెట్లను బుక్ చేసుకున్న ప్రయాణికులకు ఈ రాయితీ వర్తిస్తుందని తెలిపింది. ఈ ఆఫర్లో భాగంగా టికెట్ బుక్ చేసుకున్న ప్రయాణికులు ఈ నెల 15 నుంచి 2019, జూన్ 30 మధ్య కాలంలో ఎప్పుడైనా ప్రయాణించవచ్చని ఎయిర్ ఏషియా పేర్కొంది. ప్రస్తుతం ఎయిర్ ఏషియా దేశీయంగా బెంగళూరు, హైదరాబాద్, విశాఖపట్నం, కోల్‌కతా, కోచి సహా మరికొన్ని నగరాలకు సర్వీసులను నిర్వహిస్తోంది. అలాగే కౌలాలంపూర్, బ్యాంకాక్, క్రాబీ, సిడ్నీ, ఆక్లాండ్, మెల్బోర్న్, సింగపూర్, బాలి తదితర నగరాలకు అంతర్జాతీయ సర్వీసులను నడుపుతోంది.













