మనకూ ఎయిర్ఫోర్స్ వన్!
ప్రధాని, రాష్ట్రపతి ప్రయాణించే విమానాలకు కూడా ఎయిర్ఫోర్స్ వన్ తరహా రక్షణ వ్యవస్థను కల్పించనున్నారు. ఈ మేరకు రెండు అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థలను విక్రయించేందుకు ఆమెరికా అంగీకరించింది. వీటిని ప్రధాని, రాష్ట్రపతి ప్రయాణించే బోయింగ్-777 విమానాలకు అమర్చుతారు. ఈ డీల్ విలువ 19 కోట్ల డాలర్లు. ఇలాంటి రక్షణ వ్యవస్థ అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే విమానానికి ఉంది. ఈ డీల్ ప్రకారం లార్జ్ ఎయిర్క్రాఫ్ట్ ఇన్ఫ్రారెడ్ కౌంటర్మెజర్స్, సెల్ఫ్ ప్రొటెక్షన్ సూట్స్ అనే వ్యవస్థలను భారత్కు విక్రయిస్తున్నట్లు అమెరికా రక్షణ భద్రతా సహకార సంస్థ వెల్లడించింది.













