సీనియర్ సిటజన్లకు శుభవార్త చెప్పిన ఎయిరిండియా
ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక రాయితీని అందిస్తున్నట్లు ప్రకటించింది. తమ వెబ్సైట్ నుంచి 60 ఏళ్ల పైబడిన భారతదేశ పౌరులు బుక్ చేసుకునే ప్రతి ఎకానమీ క్లాస్ టికెట్‌పైనా 50 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చని ఒక ప్రకటనలో తెలిపింది. సీనియర్ సిటిజన్లు వయస్సును ధ్రువీకరించేందుకు ప్రభుత్వం గుర్తించిన సరైన గుర్తింపు కార్డులను పొందుపర్చాల్సి ఉంటుందని తెలిపింది. ప్రయాణ తేదికి వారం రోజుల ముందు టిక్కెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుందని వెల్లడించింది. అదే విధంగా సీనియర్ సిటిజన్‌తో ప్రయాణించే చిన్నారులకు రూ.1000ల ప్రత్యేక డిస్కౌంట్‌ను కూడా ఆఫర్ చేసింది.













