చరిత్ర సృష్టించిన ఎయిరిండియా
సౌదీ అరేబియా గగనతలం మీదుగా ఇజ్రాయెల్‌కు వెళ్లి భారత విమానయాన సంస్థ ఎయిరిండియా చరిత్ర సృష్టించింది. ఢిల్లీ నుంచి బయలుదేరిన ఎరియిండియా విమానం నేడు ఇజ్రాయెల్‌లోని టెల్ అవివ్‌కు చేరుకుంది. అయితే సాధారణంగా సౌదీ అరేబియా ఇజ్రాయెల్ వెళ్లే విమానాలను వారి గగనతలం నుంచి వెళ్లేందుకు అనుమతించదు. కానీ ఎయిరిండియాకు ఆ ఆనుమతి ఇవ్వడంతో నేరుగా సౌద మీదుగా ఢిల్లీ నుంచి టెల్ అవివ్‌లోని బెన్ గురియాన్ విమానాశ్రయానికి విమానం చేరుకుంది. సౌదీ దశాబ్దాల క్రితం విధించిన నిషేధాన్ని ఎయిరిండియా కోసం సడలించి భారత్-ఇజ్రాయెల్‌ల సంబంధాల్లో కొత్త శకనానికి నాంది పలికింది.













