రాజకీయాలకు ఆడ్వాణీ గుడ్ బై
బీజేపీ కురవృద్ధుడు లాల్ కృష్ణ ఆడ్వాణీ ఎన్నికల రాజకీయాలకు స్వస్తి పలికారు. ఆయన వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా గతవారం స్వయంగా ఆడ్వాణీని కలిసి గాంధీనగర్ నుంచి తిరిగి ఎన్నికల్లో పోటీ చేయాలని కోరారు. అందుకు ఆయన నిరాకరించారు. దాంతో, కనీసం ఆడ్వాణీ సంతానమైన ప్రతిభ, జయంత్‌లతో ఒకరిని బరిలో దింపాలని, వారిని గెలిపించుకునే బాధ్యతను తీసుకుంటామని అమిత్‌షా విజ్ఞప్తి చేశారు. అందుకు కూడా ఆడ్వాణీ నిరాకరించారు. కుదరదు. ధన్యవాదాలు అని ముక్తసరిగా చెప్పి అమిత్‌షాను తిప్పి పంపినట్లు తెలుస్తోంది.













