డిసెంబర్ 16న నిర్భయ దోషులకు ఉరిశిక్ష ?
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ దోషులకు ఉరిశిక్ష ఖరారైనట్లు సమాచారం. ఈ నెల 16న (సోమవారం) ఉదయం 5 గంటలకు నలుగురు దోషులకు ఉరిశిక్ష విధిస్తున్నట్లు తిహార్ జైలు అధికారులు తెలిపినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందినట్లు సమాచారం. ప్రస్తుతం వారున్న తిహార్ జైలులోనే వారిని ఉరి తీయనున్నట్లు తెలిసింది. ఈ మేరకు జైలు అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. కాగా దోషుల్లో ఒకరైన వినయ్ శర్మ రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టుకున్న విషయం తెలిసింది. దీనిపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తిరస్కరిండచంతో ఉరిశిక్షకు లైన్‌క్లియర్ అయ్యింది.













