బ్యాంకుల పరిసరాల్లో ఆధార్ కేంద్రాలు
బ్యాంకుల పరిసరాల్లో ఆధార్ నమోదు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిం దిగా భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) పలు ప్రైవేటు, ప్రభుత్వ రంగ బ్యాంకులను కోరింది. బ్యాంకులకు ఉన్న ప్రతి 10 శాఖల్లో కనీసం ఒక శాఖ వద్దనైనా ఆగస్టు చివరికల్లా నమోదు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలంది.
ఇందుకోసం ఆధార్ నిబంధనలకు యూఐడీఏఐ పలు సవరణలు చేసింది. ప్రస్తుతం దేశంలో 25 వేల ఆధార్ నమోదు కేంద్రాలు ఉండగా, ఒక్కటి కూడా బ్యాంకు పరిసరాల్లో లేదు. అలాగే దేశంలో 12లక్షల బ్యాంకు శాఖలు ఉన్నాయి. ఆ లెక్కన ఆగస్టు చివరికల్లా మరో 12 వేల ఆధార్ నమోదు కేంద్రాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.













