సన్నాఫ్, డాటరాఫ్, వైఫాఫ్ లకు స్వస్తి !
ఆధార్, పాన్‌కార్డులో ఇక తల్లిదండ్రులు, భర్త పేర్లు ఉండకపోవచ్చు. ఈ మేరకు కేంద్రం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు ఆయా కార్డులో సన్నాఫ్, వైఫ్ ఆఫ్, డాటరాఫ్ అని నమోదు చేసేవారు. ఇప్పుడు వాటిని తెలుగించి కొత్తగా కేరాఫ్ అన్న దానిని తీసుకురావాలని యోచిస్తున్నట్లు సమాచారం. అంతే కాదు, త్వరలోనే ఈ విధానం అమల్లోకి రానున్నట్టు తెలుస్తోంది. ఇక నుంచి కొత్తగా ఆయా కార్డుతెలకు దరఖాస్తు చేసేవారు మునుపటి లానే అన్ని ధ్రువీకరణ పత్రాలు సమర్పించాల్సి ఉంటుంది. అయితే, కొత్తగా జారీ అయ్యే కార్డుల్లో మాత్రం బందుత్వానికి సంబంధించిన వివరాలు ఉండవు. అంతేకాదు, ఆధార్, పాన్‌కార్డులో మార్పుల కోసం దరఖాస్తు చేసుకునే వారి కార్డులోని పాత డేటాను కూడా తొలగించనున్నారు. ప్రభుత్వం నిర్ణయం వెనక ఉన్న కారణం సృష్టంగా తెలియనప్పటికీ సీఎఎ, ఎన్నార్సీ అముపై పట్టుదలగా ఉన్న ప్రభుత్వం అందులో భాగంగానే ఈ మార్పు చేస్తున్నట్లు తొస్తోంది. అయితే ఈ విషయమై ఆధార్ సంస్థ నుంచి ఎటువంటి ఉత్తర్వులు వెలువడలేదు.













