యార్లగడ్డకు అరుదైన గౌరవం!
అంతర్జాతీయ వేదికపై తెలుగువాడికి అరుదైన గౌరవం దక్కనుంది. మాజీ ఎంపీ, కేంద్రీయ హిందీ సమితి సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ( వైఎల్పీ) ఈ నెల 17 నుంచి కెనడా వేదికగా జరిగే అంతర్జాతీయ హిందీ సాహిత్య సదస్సు-2018కి అధ్యక్షత వహించనున్నారు. అంతర్జాతీయ హిందీ సాహిత్య సదస్సుకు అధ్యక్షత వహించాలని కోరుతూ ఒక తెలుగువాడికి ఆహ్వానం రావడం ఇదే తొలిసారి. సదస్సు నిర్వాహక కార్యదర్శి ప్రొఫెసర్ శరణ్ ఘాయ్ నుంచి వైఎల్పీకి ఆహ్వానం అందింది. కెనడాలో భారత కాన్సుల్ జనరల్ దినేశ్ భాటియా ఈ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. దేశ విదేశాలకు చెందిన హిందీ సాహితీ వేత్తలు, కెనడా పార్లమెంటు సభ్యులు ఈ సదస్సుకు హాజరవుతున్నారు. సదస్సు అనంతరం వైఎల్పీ అమెరికాలోని కొన్ని యూనివర్సిటీల్లో హిందీ ఫ్యాకల్టీ సమావేశాల్లో పాల్గొంటారు.













