న్యూ ఇండియా సదస్సుకు గవర్నర్
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 2022 నాటికి 75 ఏళ్లు పూర్తికానున్న నేపథ్యంలో అప్పటికి సాధించాల్సిన లక్ష్యాలపై నేడు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అధ్యక్షతన న్యూ ఇండియా 2022 పేరుతో ప్రత్యేకంగా సదస్సు జరుగనుంది. ఈ సదస్సులో రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రులు, అన్ని రాష్ట్రాల గవర్నర్లు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు పాల్గొంటారు. రెండు రోజులపాటు జరిగే ఈ సదస్సులో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. దేశంలో విద్యా, వృత్తి, నైపుణ్యం, అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, భద్రత తదితర అంశాలను సదస్సులో చర్చించనున్నారు.













