విదేశాల నుంచి వచ్చిన వారి జాడ కనుక్కోండి…
విదేశాల నుంచి గత రెండు నెలల్లో మన దేశంలోకి దాదాపు 15 లక్షల మంది వచ్చారని, వారిపై సరైన నిఘా లేదని వెల్లడించిందని కేంద్రం తెలిపింది. వెంటనే రాష్ట్రాలు చర్యలు తీసుకోవాలని, వారిపై నిఘా పెంచాలని సూచించింది. ఈ మేరకు కేంద్ర క్యాబినెట్ సెక్రటరీ రాజీవ్ గుహా గురువారం అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖ రాశారు. ఇమ్మిగ్రేషన్ బ్యూరో ఇచ్చిన వివరాలమేరకు జనవరి 18వ తేదీ నుంచి మార్చి 23వ తేదీ మధ్య 15 లక్షల మంది అంతర్జాతీయ ప్రయాణికులు భారత్కు వచ్చారని తెలిపారు. ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో పరిశీలనలో ఉన్న విదేశీ ప్రయాణికుల సంఖ్యకు, అసలు సంఖ్యకు మధ్య వ్యత్యాసం ఉన్నదన్నారు. ఈ 15 లక్షల మంది విమానాల ద్వారా వచ్చినవారు మాత్రమేనని, సముద్రమార్గంలో, అంతర్జాతీయ సరిహద్దుల గుండా వచ్చినవారు అదనమని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. వీరిని గుర్తిస్తే కరోనానను అదుపు చేయవచ్చని భావిస్తున్నారు.













