హోం క్వారంటైన్ లో లోహియా ఆసుపత్రి సిబ్బంది
కరోనా వైరస్ బారిన పడ్డ వారికి వైద్య సిబ్బంది నిరంతరం చికిత్స అందిస్తోంది. ఈ క్రమంలో వైద్య సిబ్బంది కూడా కరోనా అనుమానిత లక్షణాలతో ఇంటికే పరిమితం అవుతున్నారు. ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియాలో ఆస్పత్రిలో కరోనా రోగులకు చికిత్స అందిస్తున్న ఒక నర్సు నిన్న సాయంత్రం నుంచి జ్వరంతో బాధపడుతోంది. దీంతో ఐసోలేషన్ వార్డులో పని చేస్తున్న 14 మంది సిబ్బంది హోం క్వారంటైన్లో ఉంటామని ఆస్పత్రి యాజమాన్యానికి చెప్పింది. ఈ 14 మందిలో ఆరుగురు డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బంది ఉన్నారు. వీరి బ్లడ్ శాంపిల్స్‌ను వైద్యులు సేకరించారు. వీరికి కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1071కి చేరగా, 29 మంది మ•తి చెందారు. 99 మంది కోలుకున్నారు.













