ప్రస్తుత ప్రపంచంలో ప్రబలశక్తి భారత్: నెతన్యాహు
ప్రస్తుతం ప్రపంచంలో ప్రబలశక్తి భారత్ అని అభివర్ణించారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు. ప్రపంచంలోని ఇతర దేశాల్లో తమ దేశ చట్టబద్ధతకు విఘాతం కలిగించే ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ భారత్ మాత్రం ఇజ్రాయెల్ పట్ల అవ్యాజ ప్రేమ చూపిస్తోందన్నారు. జోర్డాన్ వ్యాలీలో ఒక నాయకత్వ కార్యక్రమంలో ప్రసంగిస్తూ ఆయన ఈ విషయం వెల్లడించారు. విస్తరిస్తున్న ఇజ్రాయెల్ అంతర్జాతీయ సంబంధాలకు, దౌత్య భాగస్వామ్యాల విస్తరణకు, అది చేస్తున్న ప్రయత్నాలకు భారత్ కీలక ఉదాహరణ అని నెతన్యాహు అన్నారు. ప్రపంచంలో మరెక్కడా లేనంతమంది అభిమానులు తనకు భారత్‌లో ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం అమెరికాతో కలిసి ఇజ్రాయెల్.. ఇరాన్‌పై దాడులు చేస్తోంది. ఈదాడులను చాలా దేశాలు బహిరంగంగా విమర్శిస్తుండగా.. భారత్ మాత్రం ఆచితూచి వ్యవహరిస్తోంది.కొన్ని సందర్భాల్లో అంటే నేరుగా సామాన్యులు, చిన్నపిల్లలపై దాడులు జరిగినప్పుడు మాత్రమే భారత్ ఖండిస్తోంది. అంతేకాదు… ఇజ్రాయెల్‌తో మునుపటిలా బలమైన బంధాలను కొనసాగిస్తోంది భారత్.
ఇటీవల చైనా, రష్యా.. ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా తీర్మానాలు ప్రవేశపెట్టినా.. యూఎన్ఓలో భారత్ మాత్రం దూరంగా ఉండపోయింది. అంతేకాదు..ఇజ్రాయెల్‌తో భారత డిఫెన్స్ బంధం .. రోజురోజుకూ మరింత బలపడుతోంది. మొన్న ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్‌కు కీలక సహకారం అందించింది ఇజ్రాయెల్. ఆ ఆయుధాలతోనే .. పాక్,చైనాల ఆటకట్టించింది ఇండియా.
ఇక.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు.. మోడీతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఇద్దరి మధ్య మంచి స్నేహబంధం కూడా ఉంది. దీనికి తోడు ఇటీవలి కాలంలో ఇజ్రాయెల్.. ఇరాన్పైదాడులను కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకించగా..బీజేపీ , కేంద్రంసమర్థిస్తూ వచ్చింది.







