ప్రచారానికి షర్మిల, విజయమ్మ
వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ తల్లి విజయమ్మ, సోదరి షర్మిల ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఈ నెల 27న షర్మిల మంగళగిరి నుంచి ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు. మంగళగిరి నుంచి ఇచ్ఛాపురం వరకు దాదాపు 10 జిల్లాలో షర్మిల రోడ్ షో, బస్సుయాత్ర ఆమె నిర్వహించనున్నారు. 50 నియోజకవర్గాల్లో షర్మిల పర్యటిస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. మరో 40 నియోజకవర్గాల్లో వైఎస్ విజయమ్మ ప్రచారం నిర్వహించనున్నారు. అయితే ఆమె పర్యటించే నియోజకవర్గాలు, జిల్లాల వివరాలను త్వరలో విడుదల చేస్తామని పార్టీ నేతలు తెలిపారు. వీరి ప్రచారం కోసం రెండు బస్సులను సిద్ధం చేశారు.













